పూరీ సినిమా చేయకపోవడానికి అదే కారణమా..?

కేవలం తన సినిమా టైటిల్స్ తోనే ఆసక్తి పెంచే దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరోయిజం ఎలివేట్ చేయడం నంబర్ వన్ దర్శకుడు. చాలా మంది యువ హీరోలు ఆయన దర్శకత్వంలో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అటువంటి పూరీ నుండి ఈ మధ్య పెద్దగా హిట్ సినిమాలు
రాలేదు. లోఫర్, ఇజం సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఈ సినిమాల తరువాత రెండు, మూడు సినిమాలు చేస్తున్నట్లు మాటలు వినిపించినా.. అవేవీ సెట్ కాలేదు.

ఆయన డైరెక్ట్ చేసిన ‘రోగ్’ సినిమాను కూడా ఇంకా రిలీజ్ చేయడం లేదు. అయితే పూరీజగన్నాథ్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ పూరీ పారితోషికం విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ కావడం లేదట. అందుకే వేరే నిర్మాతలు కూడా ఆయనను సంప్రదించడానికి వెనుకడుగు వేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.