బాలయ్య కోసం కొత్త కథ!

గత కొంతకాలంగా బాలయ్య 101వ సినిమా ఎవరితో చేస్తారనే విషయంలో శ్రీవాస్, వినాయక్, కె.ఎస్.రవికుమార్ ఇలా పలు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి పూరీ జగన్నాథ్ కూడా చేరారు. అయితే పూరీ, బాలయ్యకు మహేష్ బాబు కోసం అనుకున్న
జనగణమన కథ వినిపించారని అన్నారు కానీ నిజానికి పూరీ, బాలయ్య కోసం ఓ కొత్త కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ కథను వినిపించడానికి బాలయ్య అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు.

బాలయ్య కూడా పూరీతో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాడు. ఒకవేళ పూరీ చెప్పిన కథ గనుక నచ్చితే తనతో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. నచ్చకపోతే గనుక శ్రీవాస్ తో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడట బాలకృష్ణ. అలానే ఎన్టీఆర్ బయోపిక్ కోసం కూడా ఓ దర్శకుడిని వెతుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పెద్ద దర్శకుల చేతుల్లోకి ఈ సినిమా వెళ్ళే అవకాశం ఉంది.