పాకిస్థానీ పిల్లతో పూరి కొడుకు ప్రేమయానం!

బాలకృష్ణ హీరోగా ఇటీవల ‘పైసా వసూల్’ సినిమాను రూపొందించిన పూరి జగన్నాథ్ ఇప్పుడు తన తనయుడు సినిమాపై ఫోకస్ పెట్టాడు. పూరి అతడి కొడుకు ఆకాష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈసారి లవ్ స్టోరీతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు పూరి. దానికి తగ్గ కథ ఆయన దగ్గర సిద్ధంగా ఉంది. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో సాగే ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇండియా అబ్బాయికి, పాకిస్థానీ అమ్మాయికి జరిగే ప్రేమకథ నేపధ్యంలో ఈ సినిమా సాగబోతుందని సమాచారం.

‘లవ్ స్టోరీ చేసి చాలా కాలం అయింది. మా అబ్బాయి కోసం ఓ ప్రేమకథ సిద్ధం చేశాను. అదొక డిఫరెంట్ పాయింట్. నిజాయితీ ఉన్న ప్రేమకథ’ అని చెప్పుకొచ్చాడు పూరి. నిజానికి ఆయన దగ్గర మూడు కథలు ఉన్నాయట. అయితే ఇండియా, పాకిస్తాన్ కథపైనే పూరి మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఛార్మికి అప్పగించాడట పూరి. కొంతమంది అమ్మాయిలతో ఆకాష్ కు ఫోటో సెషన్స్ కూడా నిర్వహించిది ఛార్మి.