మహేష్ కథతో వెంకీ!

ఇండస్ట్రీలో దర్శకులు ఒకరి దృష్టిలో పెట్టుకొని కథ రాయడం ఆ కథ కాస్త వేరే హీరోలకు వెళ్ళడం ఇదంతా తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. మహేష్ బాబు కోసం అనుకున్న కథతో వెంకటేష్ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెంకీ నటించిన ‘గురు’ సినిమా సిద్ధంగా ఉంది. దీంతో వెంకీ తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో పూరిజగన్నాథ్, వెంకటేష్ ను కలిసి కథ వినిపించడం జరిగింది. దానికి వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని 45 కోట్ల బడ్జెట్ లో నిర్మించాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. సురేష్ బాబుతో కలిసి వెంకీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు టాక్. అయితే ఈ సినిమా కథకు సంబంధించి ఓ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గతంలో పూరీ, మహేష్ తో ‘జనగణమన’ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పూరీ, వెంకీకు వినిపించి ఒప్పించాడు. మహేష్ బాబు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారడం, పూరీ ఛాన్స్ వచ్చేసరికి ఆలస్యం అవుతుందనే ఆలోచనతో వెంకీను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.