పోలీస్ ఆఫీసర్ గా సీనియర్ నటి!

తెలుగు, తమిళ బాషల్లో దాదాపు అగ్రహీరోలందరి సరసన ఆడిపాడింది సిమ్రాన్. అటు గ్లామర్ పరంగా, నటన పరంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. డాన్స్ చేయడంలో ఆమెకు పోటీరారు మరెవ్వరూ.. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన అనంతరం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయింది. పెళ్ళయిన తరువాత అడపాదడపా చిన్న చిన్న రోల్స్ లో కనిపించినప్పటికీ పూర్తి స్థాయి పాత్రలో ఇప్పటివరకు నటించలేదు. ఎవరైనా అటువంటి రోల్స్ ఆఫర్ చేసినా.. దాటేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఓ తమిళ సినిమాలో నటించడానికి ఈ సీనియర్ నటి అంగీకరించినట్లు తెలుస్తోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ ఉందట. దానికి సిమ్రాన్ అయితే సెట్ అవుతుందని భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటివరకు సరైన పాత్ర దొరకకపోవడం వలనే సినిమాలు చేయలేదని సెల్వా చెప్పిన కథ, నా పాత్ర బాగా నచ్చాయని చెబుతోంది సిమ్రాన్. మరి ఇదే జోరుతో తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటిస్తుందేమో చూడాలి!