
Pushpa 2 OTT release date:
అల్లు అర్జున్ నటించిన Pushpa 2: The Rule బాక్సాఫీస్‌పై తన హవా కొనసాగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి భాగం కన్నా పెద్ద హిట్ అవుతోంది. ప్రత్యేకంగా బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది.
ఇప్పటి వరకు థియేటర్లలో హవా చూపిస్తున్న ఈ సినిమా ఇప్పుడు OTTలో కూడా రికార్డులు సెట్ చేయబోతుందా? సినిమా మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం, సినిమా కనీసం 56 రోజులకు ముందు ఏ దిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రాదు. కానీ తాజా వార్తల ప్రకారం, ఈ సినిమా జనవరి 30, 2025న Netflixలో స్ట్రీమింగ్‌కి వస్తుందట.
ఈ వార్తలు నిజమైతే, ప్రేక్షకులు సినిమా మరోసారి ఎంజాయ్ చేయవచ్చు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ హై బడ్జెట్ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అలాగే ఫహాద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించారు.
ఇంకా దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ “పుష్ప” అవతారంలో మరోసారి అభిమానులను విపరీతంగా ఇంప్రెస్ చేశారు.
ALSO READ: SSMB29 విడుదల తేదీ గురించి గుట్టు రట్టు చేసిన రామ్ చరణ్!