HomeTelugu Big Stories‘పుష్పక విమానం’ ట్రైలర్‌

‘పుష్పక విమానం’ ట్రైలర్‌

Pushpaka Vimana Trailer

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను అల్లు అర్జున్‌ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు.

పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్‌(ఆనంద్‌ దేవరకొండ) అనే స్కూల్‌ టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? అసలు సుందర్‌ భార్య నిజంగానే వెళ్లిపోయిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘‘యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమా రూపొందించాం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది.’’ అని దర్శక-నిర్మాతలు చెప్పుకొచ్చారు. రామ్‌ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. సునీల్‌, నరేశ్‌, హర్షవర్థన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu