నటిగా మారనున్న పీవీ సింధు?

నటుడు సోనూ సూద్ తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్రీడలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న పి.వి.సింధు జీవితం ఆధారంగా బయోపిక్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. చాలా రోజులు కష్టపడి స్క్రిప్ట్ లాక్ చేసిన ఆయన తాజాగా సింధును, ఆమె కుటుంబ సభ్యులను కలిసి సినిమాకు కావల్సిన సమాచారాన్ని సేకరించారు.

ఈ చిత్రంలో సింధు జీవితంలోని ఎత్తు పల్లాలు, కష్ట సుఖాలు, జయాపజయాలు అన్నిటినీ చూపిస్తారట. ఇంతకీ ఈ సింధు పాత్రలో ఎవరు నటిస్తారని ఆమె తల్లిందండ్రులను అడగ్గా ఇంకా ఆ విషయం ఫైనల్ కాలేదని, ఒకవేళ సింధూనే నటించ మని అంటే ఆలోచిస్తామని అన్నారు. దీన్నిబట్టి సింధు నటించడంపై వాళ్లకు పెద్దగా అభ్యంతరాలు లేవని అర్థమవుతోంది. మరి ఈ చిత్రంలో వేరే ఎవరైనా నటిస్తారా, ఎవరూ కుదరకపొతే సింధునే నటిస్తుందా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.