
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ 7, 2023 న థియేటర్ల లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ దగ్గర నుండి విడుదలైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కు మంచి కిక్క్‌ని ఇచ్చాయి.
తాజాగా ఈ చిత్రం నుండి ‘ప్యార్ లోన పాగల్’ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ ప్రోమో కి సంబంధించిన పూర్తి పాట ఫిబ్రవరి 18 న విడుదల కానుంది. అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందిస్తున్నారు.













