HomeTelugu Big Stories26 న రా రండోయ్ వేడుక చూద్దాం!

26 న రా రండోయ్ వేడుక చూద్దాం!

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన 30 సెకన్ల టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ను విడుదల చేశారు. ‘బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ.. కంటి నిండ ఆశలతో మా సీతమ్మ… తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య.. సీత చెయ్యి పట్ట వచ్చె మా రామయ్య’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలోనే ఈ టైటిల్‌ సాంగ్‌ 90 సెకన్ల వీడియోను రిలీజ్‌ చేస్తారు. అలాగే చిత్రాన్ని మే 26న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!