Homeతెలుగు Newsరాధే శ్యామ్ మొదటి రోజు వసూళ్ళు..!

రాధే శ్యామ్ మొదటి రోజు వసూళ్ళు..!

Radhe Shyam Day one Hindi collections Bad

అద్భుతాలు ప్రతీసారీ జరగవు. సాహో సినిమా ఫ్లాపయినా మొదటి రోజు రూ.100 కోట్లు కొట్టిందంటే దానికి బాహుబలి క్రేజ్ ఉంది. ‘సాహో’ రే బాహుబలి.. అనే పాటలో అక్షరాల్ని తీసుకుని టైటిల్ గా పెట్టారు, ఫైట్ లు గట్రా ఉన్నాయి కాబట్టి దానికి కుదిరింది. ఆ మాత్రం దానికే ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ అనేయడం మొదలుపెట్టాం. కానీ నిన్న విడుదలైన రాధే శ్యామ్.. కు పాన్ ఇండియా రేంజ్ లో ఎందుకు కలెక్షన్లు రాలేదు. చెప్పాలంటే సాహో కంటే దీనికే కాస్త బెటర్ టాక్ వచ్చింది. అయినా ఓపెనింగ్స్ సాహో స్థాయిలో రాలేదు. నార్త్ సోదరులకు ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా తెలీదు. అయినా అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ టికెట్లు తెగడం లేదు. ఒకసారి మొదటి రోజు కలెక్షన్స్ ను చూస్తే :

నైజాం : 10.55 కోట్లు
సీడెడ్ : 3.6 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.92 కోట్లు
ఈస్ట్ : 2.55 కోట్లు
వెస్ట్ : 2 కోట్లు
కృష్ణా : 0.92 కోట్లు
గుంటూరు : 2.5 కోట్లు
నెల్లూరు : 1.08 కోట్లు
——————————————————–
ఏపి+తెలంగాణ : 25.12 కోట్లు
కర్ణాటక : 3.10 కోట్లు
తమిళనాడు : 0.20 కోట్లు
హిందీ : 3.2 కోట్లు
కేరళ : 0.10 కోట్లు
ఓవర్సీస్ : 6.2 కోట్లు
రెస్ట్ : 2.4 కోట్లు
——————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ : 40.32 కోట్లు(షేర్ (అన్ని వెర్షన్లు కలుపుకుని))

అది సంగతి… ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మొత్తంగా 200 కోట్లు షేర్ ను రాబట్టాలి. అంటే ఇంకో రూ.160 కోట్లు రాబట్టాలి. ఏదో అద్భుతం జరిగితే తప్ప అది సాధ్యం కాదనిపిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!