HomeTelugu Trendingటిల్లు-2: రాధిక సాంగ్‌ విడుదల

టిల్లు-2: రాధిక సాంగ్‌ విడుదల

Radhika Lyric Video from Ti
సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘టిల్లు 2’ . ఈ సినిమాకి మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్‌ ప్రేక్షకులను ఆట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ రాధిక అంటూ సాగే సెకండ్ సింగిల్ విడుద‌ల చేశారు.

‘డీజే టిల్లు’ లో రాధిక పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. ఈ మూవీలో హీరోయిన్ కంటే రాధిక అనే పేరే ఎక్కువ పాపుల‌ర్ అయ్యింది. అయితే టిల్లు 2 లో కూడా రాధిక ఉండ‌బోతుంది. ఎందుకంటే రాధికా పేరు మీదనే సెకండ్ సాంగ్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

చెప్పు రాధిక ఏం కావాలి నీకు.. నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక. ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్ రాధిక అంటూ టిల్లు మాట‌ల‌తో పాట మొద‌లైంది. రింగులా జుట్టు చూసి పడిపోయానే బొంగులా మాట‌లిని పడిపోయానే.. రంగుల కొంగు తాకి పడిపోయానే.. నీ గాలి సోకి నేను స‌చ్చిపోయానే రాధిక రాధిక రాధిక అంటూ ఫుల్ పార్టీ మోడ్‌లా సాగింది.

ఇక కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాట‌కు రామ్ మిరియాల పాడ‌ట‌మే కాకుండా సంగీతం అందించాడు. కాగా.. ఈ మూవీ ఫిబ్రవరి 9, 2024 గ్రాండ్‌గా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!