
Jack Movie Collections:
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చిన సిద్దూ జొన్నలగడ్డ… తన తాజా చిత్రం Jack తో మాత్రం చాలా పెద్ద ఫ్లాప్‌ను ఎదుర్కొన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. కానీ, మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చి, కలెక్షన్లలో ఘోరంగా పరాజయం పాలైంది.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అన్నీ అడ్వాన్స్ బేసిస్‌పై అమ్ముడయ్యాయి. సిద్దూ మాత్రం నైజాం రైట్స్ తీసుకుని తన పారితోషికంలో భాగంగా పెట్టుకున్నాడు. కానీ జాక్ సినిమా నైజాం ఏరియాలో ఒక్క కోటీ రూపాయల మార్క్‌కి కూడా చేరలేకపోయింది. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ సిద్దూ, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మీద ఒత్తిడి పెడుతూ 7 కోట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఇక ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో సినిమా డిజాస్టర్ కావడంతో, అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. బడ్జెట్ ఎక్కువగా ఖర్చు అయిన ఈ సినిమా రిలీజ్‌కి ముందే కోనసీమలో కాస్త ముందస్తు కలెక్షన్లు వచ్చాయని భావించినా… ఫైనల్‌గా ఓవర్ బడ్జెట్‌తో ఫెయిలయ్యింది.
ఈ సినిమా ఆలస్యం కూడా సినిమాని దెబ్బతీసింది. సిద్దూ జొన్నలగడ్డ, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సులు ఉండటం, నిర్మాతతో సిద్దూ మధ్య ఫైనాన్షియల్ ఇష్యూలు రావడం వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. చివరికి ఈ డిజాస్టర్ ఫలితం సిద్దూకు పెద్ద షాక్ అయ్యింది.
ఇప్పుడు సిద్దూ తన రెమ్యునరేషన్‌లో భాగాన్ని తిరిగి ఇవ్వాలని డిస్కషన్స్ జరుగుతున్నాయట. నిర్మాతకు వచ్చిన నష్టాలను కవర్ చేసేందుకు టీం ఎంతవరకు ముందుకు వస్తుందో చూడాలి.
ALSO READ: Prabhas Fauji బడ్జెట్ గురించి ఈ షాకింగ్ వివరాలు తెలుసా?