HomeTelugu Trendingమన హృదయాల్లోనే దేవుడున్నాడు

మన హృదయాల్లోనే దేవుడున్నాడు

6 1

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మన హృదయాల్లోనే దేవుడున్నాడని పవిత్ర స్థలాల్లో గుమి కూడవద్దని అన్నారు. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి విదేశాల నుండి వచ్చిన వారికి కరోనా ఉండటం ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో ఇప్పుడు కరోనా కేసులు బయట పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రెహమాన్ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని కొద్ది రోజులు పవిత్ర స్థలాల్లో గుమి కూడవద్దని ఆయన సూచించారు. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్యులకు రెహమాన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రాణాలకు లెక్కచేయకుండా డాక్టర్లు నర్సులు మనకు సాయం చేస్తున్నారని ఈ సమయంలో భేషజాలకు పోవద్దని అన్నారు. లక్షల మంది ప్రాణాలు మన చేతిలో ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అని రెహమాన్ ఆయన అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu