చిరు సినిమా నుండి రెహ్మాన్ ఔట్!

మెగాస్టార్ చిరంజీవి ‘సై.. రా నరసింహారెడ్డి’ చిత్రాన్ని మొదలుపెట్టే పనిలో పడ్డారు. ఈ చిత్రం కోసం మొదట పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహ్మాన్ ను తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఈరోజు భాగ్యనగరంలో నిర్వహింపబడుతున్న ప్రత్యక్ష సంగీత విభావరిలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ‘సైరా’ సినిమా పై కూడ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు రెహ్మాన్. 

‘సైరా’ స్క్రిప్ట్ తాను విన్నానని ఆ స్క్రిప్ట్ చాలా బాగుందని చెపుతూ తాను చిరంజీవిని చాల అభిమానిస్తున్నా తనకు సమయం చాలక తాను ఆ ప్రాజెక్ట్ వదులుకున్న విషయాన్ని బయటపెట్టాడు రెహమాన్. ఆస్కార్ విజేత రెహ్మాన్ ‘సై రా’ కోసం పని చేస్తున్నారని తెలిసి మొదట మెగాభిమానులు చాలా ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వారిని నిరాశ పరుస్తోంది.