డైరెక్టర్ గా ఇక సినిమాలు చేయను!

టాలీవుడ్ అగ్ర రచయిత విజయేంద్రప్రసాద్.. ఎన్నో హిట్ సినిమాలకు కథలను అందించారు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి కథ అందించింది కూడా ఆయనే. రాజమౌళి డైరెక్ట్ చేసే చాలా సినిమాలకు విజయేంద్రప్రసాద్ కథలను అందిస్తుంటారు. అయితే ఆయన దర్శకుడిగా
చేసిన సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలాయి. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన ‘శ్రీవల్లి’ సినిమా మరింత నిరాశ పరిచింది. దీంతో ఇకపై దర్శకుడిగా సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈ స్టార్ రైటర్.

ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఎవరు పని వాళ్ళు చేసుకుంటే మేలని, అందరికీ అన్ని వచ్చనుకుంటే పొరపాటు అని
ఆ విషయం మూడు సినిమాలు చేసిన తరువాత తెలిసిందని ఆయన అన్నారు. ఇకపై దర్శకుడిగా కంటే రైటర్ గానే ఎక్కువ ఫోకస్ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్.. ఓ సోషల్ కథను సిద్ధం చేస్తున్నాడు. ఆ కథను రాజమౌళి డైరెక్ట్ చేయనున్నాడు.