Homeతెలుగు Newsరాహుల్‌ గాంధీకి నోటిసులు

రాహుల్‌ గాంధీకి నోటిసులు

4 8ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ ‘మోసపూరితమైన, అనైతిక’ వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్లమెంటులో రఫేల్‌ ఒప్పందంపై సీతారామన్‌ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తనను కాపాడుకోవడానికి ఓ మహిళ దొరికారు అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై మహిళా కమిషన్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది.

’56 అంగుళాల ఛాతీ గల వాచ్‌మ్యాన్‌ పారిపోయి ఓ మహిళకు చెప్పారు.. సీతారామన్‌ జీ, నన్ను కాపాడండి.. నన్ను నేను కాపాడుకోలేను అని అడిగారు. రెండున్నర గంటల పాటు ఆమె ఆయనను రక్షించలేకపోయారు. నేను నేరుగా ఓ ప్రశ్న అడిగాను. యస్‌ లేదా నో అని సమాధానం చెప్పమన్నాను. కానీ ఆమె చెప్పలేదు’ అని రాహుల్‌ ఓ ర్యాలీలో అన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తప్పుపట్టింది. ఆయన మహిళల్ని గౌరవించాలని కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ వెల్లడించారు. ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆమె రక్షణ శాఖ మంత్రి అని, ఓ పార్టీ అధ్యక్షుడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను తాము ఊహించలేదని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!