నాగ్ బ్యానర్ లో యువహీరో సినిమా!

‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన రాజ్ తరుణ్ ఆ తరువాత వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ హీరోగా మారిపోయాడు. అయితే మొదటి సినిమా అప్పుడే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో మరో సినిమా చేస్తాననే కమిట్మెంట్ రాజ్ తరుణ్ కు ఉంది. కానీ ఇప్పటివరకు కుదరలేదు.

తాజాగా డిసంబర్ నెలలో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాను తమిళ మహిళా దర్శకురాలు రంజని డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కానుంది. అలానే ఓ కొత్త హీరోయిన్ ను కూడా పరిచయం చేయాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం రాజ్ తరుణ్ ‘రాజుగాడు’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, అంధగాడు వంటి చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇవి కాకుండా మారుతి కథతో మరో సినిమా చేయనున్నాడని టాక్. వీటితో పాటే అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా కూడా నాగ్ బ్యానర్ కు మంచి పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలి!