గాయపడినా షూటింగ్ ఆపలేదు!

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘ట్యూబ్ లైట్’ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఆయన కాలుకి గాయమైనప్పటికీ షూటింగ్ తో పాటు ఇతర ఏ పనులకి బ్రేక్ తీసుకోకుండా పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్భాజ్ ఖాన్
వెల్లడించారు.

”అన్నయ్య ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు.. వెకేషన్స్ లాంటి వాటికి కూడా వెళ్లడు. చివరకు కాలుకి గాయమైనప్పటికీ అన్నయ్య పని నుండి బ్రేక్ తీసుకోలేదు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటూనే షూటింగ్ లో పాల్గొన్నట్లు వెల్లడించారు. తన గాయం ఎంతగా వేధిస్తున్నప్పటికీ శనివారం రాత్రి జరిగిన 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో పెర్ఫార్మ్ చేయడం ఆపలేదు. దీన్ని బట్టి సినిమా పట్ల సల్మాన్ కు ఎంత డెడికేషన్ ఉందో తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.