దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడా..?

ఈ మధ్య కాలంలో సినిమా నిడివి అనేది రిజల్ట్ విషయంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఎక్కువ సమయం ప్రేక్షకుల్ని థియేటర్ లో కూర్చోపెట్టడం కష్టమని వీలైనంత తొందరగా సినిమాను ముగిస్తే మంచిదని భావిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు దీనికి అతీతులు కారు. ఈ మధ్య కాలంలో అతడి సినిమాలు రెండు గంటల పది నిమిషాలకు మించి ఉండడం లేదు. అయితే ఆయన
బ్యానర్ లో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ సినిమా సినిమా మాత్రం రన్ టైమ్ రెండు గంటల 30 నిమిషాలని సమాచారం. దిల్ రాజు రన్ టైమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు.

కానీ ఈసారి అనిల్ రావిపూడికి ఈ విషయంలో బాగా ఫ్రీడం ఇచ్చినట్లు అనిపిస్తోంది. సినిమాలో కామెడీ సన్నివేశాలు బాగా పండాయని, అందుకే ఎడిట్ చేయాల్సిన అవసరం రాలేదని టాక్. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో.. చూడాలి!