అవార్డులు పొందడం నా లక్ష్యం కాదు!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాహుబలి సినిమా ఆస్కార్ కి నామినేట్ కాకపోవడం పట్ల కొందరు అసహనాన్ని వ్యక్తం చేశారు. బాహుబలి2 సినిమా ఆస్కార్ కి నామినేట్ కాకపోవడం పట్ల దర్శకధీరుడు రాజమౌళి స్పందించాడు. తన సినిమాలు అవార్డులు తెచ్చిపెట్టడం కాదని, అభిమానులకు నచ్చాలని, సినీ నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టాలని ఆయన వెల్లడించారు. ఆస్కార్ రేసులో ‘బాహుబలి2’ సినిమా కాకుండా బాలీవుడ్ మూవీ ‘న్యూటన్’ నిలిచిన నేపధ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. తన సినిమా ఆస్కార్ రేసులో లేకపోవడం పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని అన్నారు.

తన లక్ష్యం అవార్డులను పొందడం కాదని ఆ సినిమా కథతో తాను సంతృప్తి చెందాలని తరువాత సాధ్యమైనంత ఎక్కువ మంది
ప్రేక్షకులను ఆ సినిమా చేరేలా చూస్తానని అన్నారు. అలానే మహాభారతం సినిమాపై స్పందించిన రాజమౌళి.. తనకు మహాభారతం సినిమాగా చేయాలని కల అని సినిమా తీస్తానని చెప్పలేదని అన్నారు.