‘RRR’ టైటిల్‌ మీరే చెప్పండి!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం కాల్పనిక కథ జోడించి ఈసినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు ఈసినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్.. మరో స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ తరహా పాత్ర చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు అన్ని భాషల్లో కలిపి RRR అనే టైటిలే పెడుతున్నారు. తాజాగా ఈ సినిమాలో ఆర్ఆర్ఆర్ వచ్చేటట్టు మంచి పేరును సూచించాలని ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంతే కాదు మంచి టైటిల్ సూచించిన వారికి తగిన పారితోషకం కూడా ఇస్తామని కూడా చెప్పింది కూడా. ఇప్పటికే రాజమౌళి మొన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ సినిమా కథ ఇది అని చెప్పాడు. దాని ఆధారంగా ఆర్ఆర్ఆర్ అబ్రివేషన్‌తో రావాలని దానిని స్వయంగా రాజమౌళి పరిశీలిస్తారని చెప్పింది. మరి ఆలస్యం ఎందుకు వెంటనే RRR సినిమాకు తగ్గ పేరును సూచించి తగిన పారితోషకం పొందండి. ఈ చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించనున్నారు. 2020 జులై 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.