బన్నీ సరసన మరో రొమాంటిక్ హీరోయిన్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ముగిసింది. హాలీడే నుండి బన్నీ తిరిగి రాగానే రెండో షెడ్యూల్ మొదలవుతుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. వారిలో పూజా హెగ్డే ఒకరు కాగా రెండో హీరోయిన్ కేతిక శర్మ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె పూరి కుమారుడు ఆకాష్ పూరి నటిస్తున్న ‘రొమాంటిక్’ సినిమాలో కథానాయకిగా నటిస్తోంది. బన్నీ కెరీర్లో 19వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

బన్నీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. రెండో షెడ్యూల్ మొదలవ్వడానికి కొంత గ్యాప్ ఉండటంతో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ వెళ్లారు. సెకండ్ షెడ్యూల్‌లో కేతిక శర్మ జాయిన్ అవుతుందట. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates