మహాభారతంపై రాజమౌళి కామెంట్!

బాహుబలి వంటి భారీ స్కేల్ ఉన్న చిత్రం తరువాత రాజమౌళి చేయబోయే తదుపరి సినిమా దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటాడు కాబట్టి మహాభారతమే తన తదుపరి ప్రాజెక్ట్ అనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తాజాగా రాజమౌళి స్పందించారు. ‘నా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చెప్పాను గన్నీ అది ఇప్పట్లో ఉంటుందని చెప్పలేదు. భారతాన్ని సినిమాగా చేయాలంటే చాలా అనుభవం కావాలి.

దానికి కాస్త సమయం పడుతుంది. ఇతర బాషల్లో కూడా మహాభారతానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేదో నాకు మాత్రమే సంబంధించిన కంటెంట్ అన్నట్లుగా చాలామంది నన్ను అడుగుతున్నారు. మహాభారతం నా ఒక్కడి సొంతం కాదు. అది ఎవరు ఎప్పుడైనా తీయొచ్చు. మహాభారతం సముద్రం లాంటిది. దానిని సినిమాగా చేయాలనుకునే వారు అందులో నుండి ఓ చెంబుడు నీళ్ళు తీసుకుంటారు. అలానే నేను కూడా ఓ చెంబుడు నీళ్ళు తీసుకుంటానని” అన్నారు.