
SSMB29 Comedy Tracks:
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 సినిమా కోసమే అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రచారం జరిగినా, ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు ఓ మంచి కామెడీ పండించే ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే తెలిసింది. ఇప్పుడు కొత్తగా లీకైన వార్తల ప్రకారం, మహేష్ పాత్రకి ఓ కామెడీ ట్రాక్ కూడా జత చేస్తున్నారని సమాచారం. ఇది పూర్తిగా హైదరాబాద్‌లో వేసిన ఓ పెద్ద గ్రామం సెట్‌లో చిత్రీకరిస్తున్నారు.
ఈ ట్రాక్‌లో మహేష్ బాబు కొత్తగా కనిపించబోతున్నారు. ఆయన సీరియస్ పెర్సనాలిటీకి వ్యతిరేకంగా గ్రామస్థుల నిజ స్వరూపం చూపించి, హాస్యాన్ని పండించబోతున్నారు. ఈ ట్రాక్ రైటింగ్‌కి రాజమౌళి ఓ హాలీవుడ్ కామెడీ రైటర్ ను కన్సల్టెంట్‌గా తీసుకున్నారని టాక్. మహేష్ డైలాగ్ డెలివరీ కూడా స్వీట్ – సార్కాస్టిక్ టోన్ లో ఉంటుందని, ఇది డెడ్‌పూల్ స్టైల్‌లా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మహేష్ – ప్రియాంక చోప్రా పాడిన ఓ పాట షూటింగ్ పూర్తయ్యింది. మే చివర్లో టీమ్‌కు బ్రేక్ ఇచ్చి, జూన్ 10 నుంచి మరో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఆ సమయంలో వారణాసిలో వేసిన మరో సెట్‌లో కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు.
ఈ సినిమాలో విలన్‌గా ప్రిత్విరాజ్ సుకుమారన్ కనిపించనుండగా, నానా పాటేకర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీతం అందిస్తున్నది ఎం.ఎం. కీరవాణి.
హాస్యం, యాక్షన్, అడ్వెంచర్ అన్నీ కలబోసిన ఈ చిత్రం 2026 లేదా 2027లో విడుదల అయ్యే అవకాశముంది. మహేష్ కామెడీ టైమింగ్ కొత్తగా కనిపించబోతుండటంతో, ఇది ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ALSO READ: Shahrukh Khan Allu Arjun కాంబోలో సినిమా గురించి Vijay Deverakonda ఏమన్నారంటే












