‘మేమ్‌ ఫేమస్‌’పై రాజమౌళి ప్రశంసలు

కొత్త నటీనటులు నటించిన ‘మేమ్ ఫేమస్’ చిత్రం గతవారం విడుదలైన బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. యంగ్‌ డైరెక్టర్‌ సుమంత్ ప్రభాస్ తానే హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రముఖ హీరోలతో ప్రమోషన్లు కూడా వినూత్నంగా నిర్వహించారు. ఇటీవల ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబు మెచ్చుకోగా.. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

చాలా కాలం తర్వాత థియేటర్‌లో ఓ సినిమాని బాగా ఎంజాయ్ చేశానని రాజమౌళి ట్వీట్ చేశారు. దర్శకుడు సుమంత్ ని ప్రత్యేకంగా అభినందించారు. సుమంత్ కోసం సినిమా చూశానని, నటుడిగా, దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. అన్ని పాత్రలు చక్కగా కుదిరాయని, నటీనటులు సహజంగా నటించారని ప్రశంసించారు. ముఖ్యంగా అంజి మామ పాత్ర బాగా నచ్చిందని తెలిపారు. ఈ సినిమాని అందరూ చూడాలంటూ ‘హైలీ రికమండెడ్’ అని రాసుకొచ్చారు. ‘యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలె.. అంతే గానీ ధమ్ ధమ్ చెయ్యొద్దు’ అని చెప్పారు.

CLICK HERE!! For the aha Latest Updates