కుమారుడు సంగీత్‌లో సతీమణితో కలిసి జక్కన్న సందడి.. చిందేసిన స్టార్లు.. వైరల్‌


ఎస్‌.ఎస్‌. రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజల పెళ్లి సంగీత్‌‌ శనివారం రాత్రి ఘనంగా జరిగింది. సినీ తారలు వేదికపై డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రానా, రాజమౌళి, ప్రభాస్‌ కలిసి తమిళ స్టార్‌ అజిత్‌ పాటకు చిందేశారు. కాబోయే దంపతులు కార్తికేయ, పూజ కలిసి డ్యాన్స్‌ చేశారు. కార్తికేయ ‘నాపేరు మురుగన్‌..’ పాటకు స్టెప్పులేశారు. ఇక కింగ్‌ నాగార్జున ‘కన్నె పిట్టరో.. కన్నుకొట్టరో..’ పాటకు చిందేశారు.

రాజమౌళి తన సతీమణి రమతో కలిసి ‘ఎట్టాగో ఉన్నాది ఓ లమ్మీ.. ఏటేటో అవుతోంది చిన్మమ్మి..’ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ సంగీత్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌ స్టార్స్‌ మధ్య అన్యోన్యతను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. జైపూర్‌లో శుక్రవారం రాత్రి ఘనంగా పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం మెహెందీ, రాత్రి సంగీత్‌ వేడుకలను నిర్వహించారు. ఆదివారం పెళ్లి వేడుక జరగనుంది.