స్టార్స్‌కి స్టెప్పులతో ఘన స్వాగతం పలికిన రాజమౌళి.. వైరల్‌

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన కుమారుడు కార్తికేయ పెళ్లికి హాజరైన స్టార్స్‌కు ఘన స్వాగతం చెప్పారు. విమానాశ్రయం నుంచి వచ్చిన సినీ ప్రముఖులతో కలిసి రాజమౌళి స్టెప్పులేశారు. దీని కోసం ప్రత్యేకంగా కొందరు కళాకారులను కూడా రప్పించారు. జైపూర్‌లో రాజమౌళి, రామ్‌చరణ్‌ కలిసి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఉపాసన ట్విటర్‌లో షేర్‌ చేశారు. రాజమౌళి, కార్తికేయ ఎంతో గొప్పగా ఆహ్వానించారని ట్వీట్‌ చేశారు. అంతేకాదు రాజమౌళి, ప్రభాస్‌, అనుష్క కూడా డ్యాన్స్‌ చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

జైపూర్‌ లో కార్తికేయ వివాహ వేడుక జరుగుతున్న సంగతి తెలిసిందే. హీరో జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌తో ఆయన వివాహం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారమే సినీ ప్రముఖులు జైపూర్‌కి చేరుకున్నారు. అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రణతి, అభయ్‌రామ్‌, ప్రభాస్‌, రానా, నాని, జగపతిబాబు, అనుష్క, సుస్మితా సేన్‌ తదితరులు పెళ్లి వేడుకకు‌ హాజరయ్యారు.శుక్రవారం రాత్రి విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. శనివారం మేహందీ, సంగీత్‌లను నిర్వహిస్తున్నారట. ఆదివారం కార్తికేయ-పూజ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నవంబరులో పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది.