రజినీకాంత్ పై బెట్టింగ్ లు షురూ!

ప్రస్తుతం తమిళనాట రజినీకాంత్ రాజకీయ ప్రవేశం హాట్ టాపిక్ గా మారింది. అసలు రజిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా..? లేదా..? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే తాజా పరిణామాలను బట్టి రజిని పోలిటికల్ ఎంట్రీకు ఇప్పుడు సానుకూల వాతావరణం ఏర్పడినట్లుగా అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు రజినీకాంత్ ఇప్పుడు అభిమానులతో చర్చలకు ఏర్పాటు చేస్తున్నాడని అంటున్నారు. ఈ నెల 15 నుండి ఐదు రోజుల పాటు రజినీకాంత్ ఆయన అభిమానులతో భేటీ కానున్నారు.
గతంలో కూడా రజిని తన అభిమానులని కలిసి సంధార్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈసారి భారీ ఎత్తున మీటింగ్స్ ఏర్పాటు చేస్తుండడంతో రాజకీయాల విషయమై అభిమానుల సూచనలను, సలహాలను తీసుకోవాలనే ఉద్దేశంతోనే రజిని ఈ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే తన నిర్ణయం చెప్పడానికి ఇదే సరైన సమయం. అయితే రజినీకాంత్ సొంతంగా పార్టీ పెడతారా..? లేదంటే ఏదైనా పార్టీకు మద్దతు ఇస్తారా..? అనే విషయంపై తమిళనాట బెట్టింగులు కూడా మొదలయ్యాయి. మరి రజిని ఈసారైనా.. తన నిర్ణయం చెబుతారో.. లేక ఎప్పటిలానే సస్పెన్స్ ను మెయిన్టైన్ చేస్తారో చూడాలి!