ఒక్క సినిమాకు అమీర్ కు ఎంత దక్కిందో.. తెలుసా..?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పారితోషిక వివరాలు వింటే ఎవరైనా.. షాక్ అవ్వాల్సిందే.. తాజాగా అమీర్ నటించిన ‘దంగల్’ సినిమాకు గానూ ఆయనకు దక్కిన రెమ్యూనరేషన్ అక్షరాల 175 కోట్లని తెలుస్తోంది. మన తెలుగు సినిమాల్లో హీరోలు పారితోషికం పేరుతో ఒక ఏరియా రైట్స్ తీసుకోవడం చేస్తుంటారు. కానీ అమీర్ ఖాన్ మాత్రం సినిమాకు వచ్చిన వసూళ్లలో వాటా తీసుకుంటాడు.

మొదట ఈ సినిమాకు పారితోషికం పేరుతో ఆయనకు 35 కోట్లు అందించారు. అది అక్కడితో ఆగిపోలేదు. తన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి అమీర్ సినిమా సాధించే వసూళ్లలో 33 శాతం రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. మరి దంగల్ సినిమా ఏ రేంజ్ లో వసూళ్లు కలెక్ట్ చేసిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని బట్టి అమీర్ కు దక్కింది 175 కోట్లని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా చూస్తూనే అమీర్ రెమ్యూనరేషన్ విషయంలో హాలీవుడ్ హీరోలతో పోటీ
పడుతున్నట్లుంది.