HomeTelugu Newsక‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రిగా రకుల్‌..

క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రిగా రకుల్‌..

Rakul preet as karnam malleహాట్‌ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు వ్యాపారరంగంలో కూడా బిజీగా ఉంది. సినిమాల విష‌యానికొస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-క్రిష్ కాంబినేష‌న్ లో రానున్న చిత్రంలో నటించనున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన మ‌రో వార్త ఫిలింనగ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. నిర్మాత కోన వెంక‌ట్ ప్ర‌స్తుతం ఒలింపిక్ విజేత, వెయిట్ లిఫ్ట‌ర్ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ తీసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో లీడ్ రోల్ కోసం హీరోయిన్ ను వెతికే ప‌నిలో ప‌డ్డారు కోన‌. తొలుత ఈ పాత్ర కోసం తాప్సీని సంప్ర‌దించ‌గా.. వేరే సినిమాతో బీజీగా ఉండటంతో తాప్సీ నో చెప్పింద‌ట‌. ఫిట్ నెస్ నైపుణ్యాలు క‌లిగిన న‌టి అయితే ఈ రోల్ కు బాగా సెట్ అవుతుంద‌ని భావించిన కోన వెంక‌ట్ ర‌‌కుల్ ప్రీత్ ను లీడ్ రోల్ కోసం ఎంపిక చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ర‌కుల్ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు స‌మాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu