HomeTelugu Trending'ఓబులమ్మ'గా రకుల్‌

‘ఓబులమ్మ’గా రకుల్‌

Rakul preet singh as a obul

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్‌ పాత్రంలు చేస్తూ వస్తుంది. తొలిసారిగా ఓ డీ గ్లామర్ పాత్రలో నటించింది. ప్రసిద్ధ నవల ‘కొండపొలం’ ఆధారంగా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న చిత్రంలో రకుల్ ఇలా డీ గ్లామర్ పాత్రను పోషించింది. తాజాగా దీని గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడింది. “ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత వున్న పాత్రను పోషించాను. డీ గ్లామర్ పాత్ర.. పైగా, రాయలసీమ యాసలో మాట్లాడుతుంటాను. ఇది నాకు కలకాలం గుర్తుండి పోతుంది.

ఎప్పుడూ గ్లామర్ తో కూడిన పాత్రలే చేస్తుంటే మన మీద ఓ ముద్రపడిపోతుంది. ‘ఈ అమ్మాయి గ్లామర్ పాత్రలు మినహా మరేమీ చేయలేదేమో’నని దర్శక నిర్మాతలు అనుకుంటారు. అందుకే, అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నాను’ అని చెప్పింది రకుల్. ఇక ఈ సినిమాలో రకుల్ పాత్ర పేరు ‘ఓబులమ్మ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి టైటిల్ గా ‘కొండపొలం’ అనే పేరునే వుంచేద్దామని క్రిష్ భావిస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu