మహేష్‌, రకుల్‌ కాంబినేషన్‌లో మరో సినిమా!

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్లో దాదాపు అందరు స్టార్ హీరోలతోటి నటించింది. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో కూడ నటించింది. మురుగదాస్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక మహేష్ బాబు త్వరలో సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రకుల్ ను హీరోయిన్‌గా తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నాడట. మరి గతంలో హిట్ అందుకోలేకపోయిన ఈ జంట ఈసారి హిట్ అందుకోవాలని ఆశిద్దాం.

CLICK HERE!! For the aha Latest Updates