మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతి సినిమాకు తన గ్రాఫ్‌ని పెంచుకుంటూ వస్తున్నాడు. కేవలం నటన పరంగానే కాకుండా.. ఫిట్‌నెస్ పరంగాను రామ్ చరణ్ చాలా కష్టపడతాడు. తాజాగా వైరల్ అయిన ఫొటోనే అందుకు నిదర్శనం. స్ట్రాంగ్ మార్నింగ్ అంటూ మంగళవారం రామ్‌చరణ్ ఓ ఫొటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో కండలు తిరిగినే శరీరంతో న్యూ లుక్‌లో రామ్‌చరణ్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామ్ చరణ్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తోంది. ఆ ఫిట్నెస్ ఏంటి సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో పాటు, కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’లోనూ నటిస్తున్నాడు.
CLICK HERE!! For the aha Latest Updates