ఓటు హక్కును వినియోగించులేకపోతున్నాను: రామ్‌ చరణ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ తన ఫేస్‌బుక్‌లో ‘కొన్ని కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాను. కానీ దయచేసి అందరూ ఓటు వేయండి’ అంటూ పోస్ట్‌ చేశారు. రామ్ చరణ్‌ ఈ సారి తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.. ఇదిలా ఉండగా రామ్‌ చరణ్‌ సతీమణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకం. ప్రతి ఓటు కౌంటబుల్‌ అవుతోంది. ఓటే మన భవిష్యత్‌ని నిర్ణయిస్తుందని.. అందరూ తప్పక ఓటు వేయాలి’ అంటూ ఉపాసన ప్రజలను కోరారు.