అక్కినేని వారసుడు అఖిల్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత అఖిల్ బోయపాటి సినిమా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నట్టు సమాచారం.

బోయపాటి.. చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ తరువాత బోయపాటి మెగాస్టార్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ, చిరంజీవి.. కొరటాలతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బోయపాటి ప్రాజెక్ట్ లేట్ అవుతుంది. ఈ లోపుగా అఖిల్ తో సినిమా చేయాలని చరణ్ ప్రపోజల్ చేసినట్టుగా తెలుస్తున్నది. అందుకు బోయపాటి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అఖిల్ కోసం ఊరమాస్ స్టోరీని సిద్ధం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.













