బోయపాటితో రామ్ చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వహిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా, చాలా కాలంగా బోయపాటి.. రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని తెలుస్తోంది.
ఇప్పటికే బోయపాటి.. చరణ్ ను కలిసి కథ కూడా వినిపించాడట. అయితే చరణ్ మాత్రం నిర్మాతగా దానయ్య పేరుని చెప్పినట్లు తెలుస్తోంది. బోయపాటికి అదే విషయాన్ని చెప్పి దానయ్యను కలవమని చెప్పాడట. తుది నిర్ణయం హీరోదే కాబట్టి ఈ సినిమాను దానయ్య నిర్మించడం ఖాయమన్నమాట.