నటుడిగా మారనున్న వర్మ!


సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటి వరకు దర్శకుడిగా.. నిర్మాతగా.. కథా రచయితగా.. గాయకుడిగా తనలోని కలలను ప్రేక్షకులకు చూపించిన వర్మ త్వరలో నటుడిగా మారనున్నాడు. ఈ రోజు వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

గన్‌ షాట్‌ ఫిలింస్‌ సంస్థ తన తొలి ప్రయత్నంగా కోబ్రా అనే చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ ప్రాజెక్ట్‌తో తొలిసారిగా వర్మ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌ ఇబ్బందుల్లో ఉన్న వర్మ తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో మరోసారి సక్సెస్‌ ట్రాక్‌లో వచ్చాడు.