HomeTelugu Big Storiesచంద్రబాబుకు రూ.3 వేల పింఛన్.. బాలయ్యకు మెరుగైన వైద్యం.. వర్మ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకు రూ.3 వేల పింఛన్.. బాలయ్యకు మెరుగైన వైద్యం.. వర్మ సంచలన వ్యాఖ్యలు

12 9వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎపుడు ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ద్వారా బాలయ్య, చంద్రబాబును టార్గెట్ చేసి తాను అనుకున్నది కొంత వరకు సాధించాడు. ఈ సినిమాను తెలంగాణలో విడుదల చేసిన ఏపీలో మాత్రం విడుదల కాలేకపోయింది. దీంతో ఏమైందో ఏమో ఎన్నికలు ముగిసిన తర్వాత బాలయ్యతో పాటు చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ సంచలన ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పటికే చంద్రబాబు..జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయినట్టు ఒక మార్ఫింగ్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పోస్ట్ పై దేవిబాబు చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. అంతేకాదు వర్మ బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు వదిలే ప్రస్తక్తి లేదంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. ఇంకోవైపు వర్మ చంద్రబాబు ఫ్యామిలీతో పాటు బాలయ్య పై చేసిన ట్వీట్స్‌పై నారా, నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఏమన్నాడంటే జగన్ ప్రభుత్వం అధికారంలో వస్తే చంద్రబాబుకు రూ.3 వేల పింఛన్, లోకేష్‌కు గ్రామ సచివాలయంలో ఉద్యోగం, చంద్రబాబు కోడలు బాలయ్య కూతురు బ్రహ్మణికి అమ్మఒడి పథకం ద్వారం రూ.15,000 ఇస్తామంటూ పోస్ట్ చేసారు. దాంతో పాటు బాలయ్యకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన మానసిక వైద్యం ఓ ఫొటోను షేర్ చేస్తూ..బాలయ్యకు మెరుగైన వైద్యం కాదు..మెరుగైన మానసిక వైద్యం అంటూ కామెంట్స్ పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!