సంజయ్ దత్ వంచకుడు: రణ్‌బిర్

ప్రస్తుతం సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్ లో రణ్‌బిర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సంజయ్ దత్ ను కామెంట్స్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బయోపిక్ లో నటిస్తోన్న రణ్‌బిర్ ఆ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ ను ఉద్దేశిస్తూ రణ్‌బిర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఇంతకీ రణ్‌బిర్ ఏమన్నాదంటే.. ‘మేము మహాత్ముని జీవితాన్ని సినిమాగా చేయడం లేదు. సంజయ్ దత్ జీవితాన్ని రూపొందిస్తున్నాం. ఆయనను కొంతమంది ఇష్టపడతారు. కొంతమంది తిడతారు. ఒక ఫ్రాడ్ మెన్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నాం. ఇందులో మేం నిజాలను నిక్కచ్చిగా చూపించబోతున్నాం. వాస్తవాలను చూపుతూ నిజాయితీగా సినిమా చేస్తున్నాం’ అని రణ్‌బిర్ చెప్పారు. అయితే ఇక్కడ రణ్‌బిర్.. ‘ఫ్రాడ్ మెన్’ అని సంజయ్ ను ఉద్దేశించి అనడం గమనార్హం. సంజయ్ ను ఫ్రాడ్ అని సంబోధించిన రణ్‌బిర్ ఆయన నిజాయితీగా విషయాలను వెల్లడించాడని, అంతే నిజాయితీగా మేం 
సినిమా చేస్తున్నామని అన్నారు.