మనసు మార్చా.. పద్దతి మార్చా..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘వంగవీటి’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కాసిన్ని ముచ్చట్లు..
అన్నీ మార్చాను..
నా మనసు మార్చాను.. పద్దతి మార్చాను.. సినిమా చేసే స్టైల్ కూడా మార్చాను..
అనుభవంతోనే తెలుస్తుంది..
నేను విజయవాడలో చదువుకున్న రోజుల్లో కొన్ని సంఘటనలు దగ్గరగా చూశాను. అయితే వాటిని సినిమాగా చేయాలని ఎప్పుడు అనుకోలేదు.. నేను గమనించిన సంఘటనల్లో నిజాలు కూడా నా అనుభవంతోనే తెలుస్తుంది. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ నాకు వచ్చాయని అనుకున్నప్పుడే ఈ సినిమా చేశాను.
పక్షపాతం చూపించలేదు..
ఒక సంఘటనపై మనకు అవగాహన ఎప్పుడు వస్తుందంటే.. ఇరువర్గాల పట్ల మనం న్యూట్రల్ గా వ్యవహరించినప్పుడే.. ఒక డైరెక్టర్ గా నేను ఒక వర్గం వైపు పక్షపాతాన్ని చూపించలేదు. నాకు
తెలిసిన కథను ప్రెజంట్ చేశాను.
వంగవీటితోనే రౌడీయిజం మొదలైంది..
వంగవీటి అనే పదంతోనే రౌడీయిజం మొదలయ్యింది.. నా కాలేజ్ డేస్ లో వంగవీటి రాధా అనే రౌడీను చంపేశారని విన్నాను. అప్పుడే వంగవీటి అనే పదం విన్నాను.. వంగవీటి రాధాతో మొదలయిన రౌడీయిజం వంగవీటి రంగాతో ముగిసింది. ఈ మధ్యలోనే కథ చూపించాను.
పెర్శనల్ గా తెలియదు..
పర్సనల్ గా నేను వంగవీటి రాధాను, రంగాను కలుసుకోలేదు. మా కాలేజ్ లో ఓ ఫంక్షన్ కు రంగా వచ్చినప్పుడు చూశాను. అలానే ర్యాలీ చేస్తున్నప్పుడు మరోసారి చూశాను. దేవినేని మురలి ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు చూశాను..
చాలా వయిలంట్ గా ఉంటుంది..
ఈ సినిమా చాలా వయిలంట్ గా ఉంటుంది. ఫైనల్ మిక్సింగ్ అయ్యే వరకు ఆ విషయాన్ని నేను కూడా రియలైజ్ అవ్వలేకపోయాను. గన్స్ లేనప్పుడు కత్తుల్లు, కొడవళ్ళు వంటి ఆయుధాలతో దాడి చేయడం.. దానికి ముందు వారి ప్లానింగ్ ఎలా ఉంటుందనే ప్రతి విషయాన్ని ఎంతో డీటైల్డ్
గా చూపించాను.
ప్రతి సినిమా గొడవల గురించే..
ప్రతి సినిమాలో హీరో, విలన్ కు మధ్య గొడవల గురించే చెబుతారు. అయితే దాన్ని చెప్పే ప్రాసెస్ డిఫరెంట్ గా ఉండాలి. దాన్ని ఆసక్తిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాను.
అప్పుడైతే అంచనాలు ఉండవు..
ఈ సినిమా కోసం పెద్ద హీరోలను సంప్రదిస్తే సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఎలాంటి ఇమేజ్ లేని వారైతే కథతో ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ హీరో అయితే కథకు కూడా సెట్ కారు. ఎందుకంటే వంగవీటి రంగా పాత్రలో పెద్ద హీరోను చూపించి ఫైనల్ గా ఆ పాత్రను
చంపేస్తే ప్రేక్షకులకు నచ్చదు.
పవన్ నిద్రపోతున్న అగ్నిపర్వతం..
పవన్ కల్యాణ్ నా దృష్టిలో నిద్రపోతున్న అగ్ని పర్వతం. సమయం వచ్చినప్పుడు ఒక విస్ఫోటంలా పేల్చుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నిటినీ పవన్ అధ్యయనం చేస్తున్నాడు. ఎన్నికల్లో అతడు ఖచ్చితంగా నెగ్గుతాడు.
అభిమానిగా అది నా కోరిక..
నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన చాలా కాలం తరువాత చేస్తోన్న సినిమా గనుక ఖచ్చితంగా అది బాహుబలి కంటే పెద్దగా ఉండాలని అభిమానిగా నేను కోరుకున్నాను.. అందులో తప్పేం లేదు.
శివ సీక్వెల్ సాధ్యం కాదు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి శివ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించడం కష్టం. కానీ నాగార్జునతో ఓ యాక్షన్ ఫిల్మ్ చేయలనుంది.