ఎనర్జిటిక్ హీరోతో పూరి, ఛార్మి ఫొటో.. ట్రెండ్‌

హీరోలను కొత్తగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు పూరి జగన్నాద్ ముందు వరసలో ఉంటాడు. కొత్త మేకోవర్ తో కొత్తగా చూపిస్తుంటారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్‌ను హైవోల్టేజ్ ఆటిట్యూడ్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ తరువాత పూరికి మరో హిట్ లేదు. హిట్ కోసం పూరి ఎదురు చూస్తున్నాడు.

ఇటు రామ్ కూడా హిట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయింది. జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. మే 2019 లో సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు. రామ్ సెట్స్ లోను సినిమాలోను చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. ఆ ఎనర్జీని పూరి ఎలా వాడుకుంటాడో చూడాలి. రామ్, పూరి, ఛార్మిలు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది.