రానా సినిమా టైటిల్ ఇదే!

బాహుబలి సినిమాలో నటిస్తూనే సోలో హీరోగా ‘ఘాజీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి
సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాకు
తేజ దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా
కోసం ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ ను బట్టి
సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్టబర్న్ గా ఉంటుందని అనిపిస్తోంది. వరుస పరాజయాల్లో
ఉన్న తేజ ఈ సినిమాతో ఎలా అయినా.. హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం సినిమా
స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates