HomeTelugu Trendingనేనొచ్చేస్తున్నా: రానా

నేనొచ్చేస్తున్నా: రానా

3 3దగ్గుబాటి రానా చికిత్స నిమిత్తం కొన్ని రోజులుగా అమెరికాలోనే ఉన్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న రానా అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అందుకే చాలా బరువు కూడా తగ్గిపోయాడు రానా. కిడ్నీ సంబంధిత సమస్యతో ఈయన బాధ పడుతున్నాడని.. దానికి అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేయించుకున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించలేదు కానీ అలాగని జరగలేదని చెప్పలేదు కూడా. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అబద్ధమే అంటూ ఆ మధ్య చెప్పాడు రానా దగ్గుబాటి.

ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇండియాకు వస్తున్నాడు. ఇదే విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అభిమానులతో పంచుకున్నాడు రానా. కార్‌లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి.. ఆల్రైట్.. ఆన్‌లైన్‌లోకి లోకి వచ్చాను. మరో 72 గంటల్లో ఇండియాలో ఉంటానంటూ క్యాప్షన్ పెట్టాడు రానా. ఇప్పుడు పెట్టిన ఫోటోలో కూడా రానా చాలా బక్కగా ఉన్నాడు. ఎప్పట్లాగే పొడవాటి గడ్డం.. షార్ట్ హెయిర్ స్టైల్‌తో అదరగొట్టాడు రానా.

కొన్ని రోజుల కిత్రం పోస్ట్ చేసిన పిక్ మాత్రం అభిమానులను కంగారు పెట్టింది. మొత్తానికి ఇండియా వచ్చిన వెంటనే వరస సినిమాలు ఉన్నాయి. ముందుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. రానా కోసమే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. మొత్తానికి రానా కమ్ బ్యాక్ గురించి హీరోలు కూడా రిప్లై ఇస్తున్నారు. త్వరగా రా.. నువ్ కమ్ బ్యాక్ పార్టీ ఇవ్వాలి నాకు అంటూ అల్లు శిరీష్ పోస్ట్ చేసాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!