HomeTelugu Big Storiesరాణాతో ఫోటో ఇప్పుడు చాలా ఈజీ!

రాణాతో ఫోటో ఇప్పుడు చాలా ఈజీ!

స్టార్లతో ఫోటోలు దిగడానికి సగటు సినిమా అభిమానులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ.. ఇకపై స్టార్ హీరోతో ఫోటో దిగడం సులభతరం చేసింది యాప్ స్టర్. “నేనే రాజు నేనే మంత్రి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. “యాప్ స్టర్” అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మల్టీప్లెక్స్ లో పెట్టిన ఏదైనా “నేనే రాజు నేనే మంత్రి” ఫ్లెక్స్ దగ్గరకెళ్లి.. సదరు ఫ్లెక్సీ స్టాండ్ పై ఉన్న కోడ్ ను స్కాన్ చేస్తే.. రాణావి కొన్ని ఫోజులు ఆగుమెంటెడ్ రియాలిటీలో మొబైల్ ఫోన్ లో కనిపిస్తాయి. రాణా ఫోజ్ కి తగ్గట్లుగా నిల్చోని నిజంగా రాణాతో ఫోటో దిగినట్లుగా ఔట్ పుట్ వస్తుంది. ఫోటో చూస్తే నిజంగా రాణాతో ఫోటో దిగినట్లే ఉంటుంది.
ఈ ఆగుమెంటెడ్ రియాలిటీతో “నేనే రాజు నేనే మంత్రి” ప్రమోషన్స్ లో సరికొత్త ట్రెండ్ మొదలైంది.
ఈ లేటెస్ట్ ట్రెండింగ్ ప్రమోషన్ కు సంబంధించిన ప్రెస్ మీట్ ను నేడు హైద్రాబాద్ లో బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు భరత్ చౌదరి-వి.కిరణ్ రెడ్డిలతోపాటు సురేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మొట్టమొదటిగా ఈ ఆగుమెంటెడ్ రియాలిటీతో రాణాతో ఫోటో దిగారు. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న “నేనే రాజు నేనే మంత్రి”లో రాణా సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా.. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యం వహించారు!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!