HomeTelugu Big Storiesబిగ్ బాస్-4 సెప్టెంబర్ 17 హైలైట్స్‌

బిగ్ బాస్-4 సెప్టెంబర్ 17 హైలైట్స్‌

Bigg boss 4 telugu 17th sep
బిగ్‌బాస్‌-4 తెలుగు 12వ ఎపిసోడ్ హైలైట్స్: దేత్తడి హారిక జోడీ కోసం వెతుకులాట మొదలు పెట్టింది. మోనాల్ దగ్గర లేదంటే హారిక దగ్గర ఉంటూ గుసగుసలు ముచ్చట్లు పెట్టే అభిజిత్‌ను పక్కనపెట్టుకుని యాంకర్ సుజాతను ఓ బ్రహ్మాండమైన ప్రశ్న వేసింది హారిక. అఖిల్-మోనాల్ మధ్య ఏదో నడుస్తుందని మాట్లాడుకుంటూ వాళ్లకి అంత సీన్ లేదు.. నాకైతే ఇంట్రస్ట్ లేదు అంటూ హారిక దగ్గర యదాప్రకారం పులిహోర కలిపే భాగంలో నిమగ్నమయ్యాడు అభిజిత్. ఇక సుజాత.. నోయల్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ నీకు నాకు మధ్య ఏదో ఉంది అనుకుంటున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని అనడంతో.. నోయల్ నిన్ను సిస్టర్‌లా చూస్తున్నా.. నీకు కూడా ఆ విషయం తెలుసు వాళ్లను పట్టించుకోకు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

హౌస్‌లో ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ పెంచేందుకు జబర్దస్త్ అవినాష్‌ను పంపించాడు బిగ్‌బాస్. వైల్డ్ కార్డ్‌తో జబర్దస్త్ అవినాష్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.. జోకర్ కాన్సెప్ట్‌లో అవినాష్‌పై చిత్రీకరించిన స్పెషల్ వీడియో చాలా ఎమోషనల్‌గా అనిపించింది. వినడానికి నవ్వొచ్చే ఈ జోకర్ వెనుక ఒక జీవితమే ఉంది అంటూ అవినాష్ జీవితంలోని కష్టాలను ఆ వీడియోలో చూపించారు. ఇక ఈ ఏవీ తరువాత హౌస్‌లోకి అడుగుపెట్టిన అవినాష్‌కి ఇంటి సభ్యుల నుంచి సాదర స్వాగతం లభించింది. ఇంటి సభ్యులందరితోనూ ఇట్టే కలిసిపోయాడు అవినాష్. అవినాష్‌ వచ్చిన తరువాత ఇంటిలో సందడి మొదలైంది. ఇక గంగవ్వ అనారోగ్యానికి గురైనట్లు కనిపిస్తుంది. అయితే బిగ్‌బాస్‌ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పింది. డాక్టర్లు ఆమెను చూస్తున్నారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు మరింత హంగామా చేస్తున్నట్లు ప్రొమోలో కనిపిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu