HomeTelugu Trending'రంగ్‌ దే' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘రంగ్‌ దే’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌


Rang de release date anno
టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రంగ్ దే’. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈసినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్‌ విడుదల అయింది. రంగ్‌ దే చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలతో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దర్శకుడు వెంకీ అట్లూరి ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. పాటలు, సన్నివేశాలు అన్ని కంప్లీట్‌ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. న‌రేష్‌, వినీత్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, గాయ‌త్రి ర‌ఘురామ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu