
Top 10 Richest Actors in the World:
అన్ని సినిమాల హీరోలు ఎక్కువగా సంపాదించలేరు. కానీ కొన్ని మంది మాత్రం తమ టాలెంట్‌తో పాటు బిజినెస్ సెన్స్‌తో కూడా అదరగొడతారు. అలాంటి వారే ప్రపంచంలో టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్ జాబితాలో ఉంటారు. 2025 సంవత్సరానికి గాను విడుదలైన లేటెస్ట్ లిస్ట్‌లో బాలీవుడ్ నుండి కేవలం ఒకే ఒక్క హీరో మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఆయన ఎవరో కాదు, మన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్!
ప్రపంచంలో అత్యంత ధనిక నటుల జాబితాలో ఆయన నాలుగో స్థానం లో ఉన్నారు. ఆయన సంపద మొత్తం 876.5 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 7300 కోట్లకు పైగా!
ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది అర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ ($1.49 బిలియన్), తర్వాత డ్వేన్ జాన్సన్ – ది రాక్ ($1.19 బిలియన్), మూడవ స్థానంలో టామ్ క్రూజ్ ($891 మిలియన్).
ఈ మూడు స్థానాల తర్వాత నాలుగో స్థానంలో మన SRK ఉండడం గర్వకారణం. షారుఖ్ సినిమాల్లో నటించడమే కాకుండా, బిజినెస్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్, ప్రొడక్షన్ కంపెనీ, లగ్జరీ ఇంట్రస్ట్స్ వంటివాటితో తన సంపదను పెంచుకున్నారు.
ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించబోయే తదుపరి చిత్రం “కింగ్”. ఈ సినిమా జూన్ 2025లో షూటింగ్ మొదలవుతుంది. సిద్దార్థ్ ఆనంద్ మరియు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది యాక్షన్‌తో కూడిన ఎమోషనల్ డ్రామా కానుంది.
“కింగ్” సినిమా టైటిల్‌కి తగ్గట్లే, షారుఖ్ ఖాన్ రియల్ లైఫ్‌లో కూడా కింగ్‌లా కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో నిలిచిన ఇతర హాలీవుడ్ స్టార్స్‌ను చూస్తే వారి సంపద ఎలా పెరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. స్టార్‌డమ్ ఒక్కటే కాకుండా, వారి స్కిల్, పెట్టుబడులు, మంచి డిసిషన్స్ వల్లే వాళ్లు ఈ స్థాయికి చేరుకున్నారు.
ALSO READ: Robinhood OTT release ఎప్పుడు ఏ ప్లాట్ ఫామ్ లో అంటే..