ఐటెమ్ సాంగ్ కు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట!

సినిమా వాళ్ళు చాలా మంది తాము టాప్ పొజిషన్ కు వెళ్ళిన తరువాత తమకు కెరీర్ లో బ్రేక్ ఇచ్చిన వారిని గుర్తు పెట్టుకోరని, వారికంత ప్రాధాన్యత ఇవ్వరనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ మాటలను తుడిపేస్తూ హీరోయిన్ రాశి ఖన్నా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో గతంలో ‘సుప్రీం’ సినిమాలో నటించింది రాశిఖన్నా. రాశి కెరీర్ కు ఆ సినిమా ప్లస్ అయిందనే చెప్పాలి. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఓ సినిమాలో ఉచితంగా ఐటెమ్ సాంగ్ లో నటించిందట రాశి.

నిజానికి రాశిఖన్నా ఇదివరకు ఐటెమ్ సాంగ్స్ లో నటించింది లేదు. కానీ మొదటిసారిగా అనిల్ రావిపూడి కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా వెనుకాడలేదట. ఈ పాట కోసం ఆమె ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయకపోవడం విశేషం. ప్రస్తుతం రాశిఖన్నా, రవితేజ సరసన ‘టచ్ చేసి చూడు’ అనే సినిమాలో నటిస్తోంది.