HomeTelugu Trendingపోతురాజు లవర్‌ వాణీ లుక్‌..

పోతురాజు లవర్‌ వాణీ లుక్‌..

Rashmi Look In Bomma Blockb
టాలీవుడ్‌ యువ నటుడు నందు నటిస్తున్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాట్ దర్శకత్వంలో ప్రవీన్ పగడాల- బోసుబాబు- ఆనంద్ రెడ్డి- మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల నందు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో జమీందార్ లా ఒళ్లంతా బంగారు ఆభరణాలు ఖరీదైన కాస్ట్యూమ్ తో కనిపించాడు. ఇక ఈ సినిమాలో నందు పోతురాజుగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను రివీల్ చేశారు మూవీ యూనిట్. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీ గౌతమ్ నటిస్తుంది. రష్మీ జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. పోతురాజు గాడి లవర్ వాణీ అంటూ రష్మీని ఇంట్రడ్యూస్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక రష్మీ గెటప్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు డ్రామా ఆర్టిస్టులు గా కనిపిస్తారని అర్ధమవుతుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu